భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీ ఆర్ అంబేడ్కర్ ముని మనుమడు రాజారత్నం అశోక్ అంబేడ్కర్ కార్యక్రమం విజయవంతం చేయాలని జై భీమ్ ఆర్మీ వ్యవస్థాపకులు పులి శ్రీకాంత్ కోరారు.
ఈ మేరకు ఆయన బుధవారం శ్రీకాళహస్తిలో విలేకరులతో మాట్లాడారు.
రాజారత్నం అశోక్ అంబేడ్కర్ ఈ నెల 28న తిరుపతి పార్లమెంటరీ నియోజక వర్గానికి విచ్చేస్తున్నట్లు చెప్పారు.
ఈ నేథప్యంలో ఆయనకు రాజకీయ పార్టీలకు అతీతంగా ఘనంగా స్వాగతం పలకడానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు శ్రీకాంత్ తెలిపారు.
ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో పాల్గొని విజయ వంతం చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
.