ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి శుక్రవారం చిత్తూరు జిల్లా పర్యటనలో భాగంగా వరద ప్రభావిత ప్రాంతాలను, తిరుచానూ రు పాడి పేట బ్రిడ్జిని పరిశీలించారు.
తిరుచానూరు పాడి పేట బ్రిడ్జి వద్ద జవాద్ తుఫాన్ కారణంగా 2021, నవంబర్ 18 న గురువారం రాత్రి స్వర్ణముఖి నది పొంగి ప్రవహించడం కొట్టుకుపోయింది. ఇక్కడ వరదలో కొట్టుకొని పోయే ప్రజల ను కాపాడడంలో తమ ప్రాణాలను ఫణంగా పెట్టి ధైర్యం, తెగువ ప్రదర్శించి 30 మంది ప్రజల ప్రాణాలను కాపాడిన వారిని ముఖ్యమంత్రి అభినందింాచరు. వారిని శాలువతో సత్కరించారు.
ముఖ్యమంత్రి చేతుల మీదుగా సత్కారం పొందిన వారిలో.. పోలీస్ శాఖ మొబైల్ కమ్యూనికేషన్ సహాయం తో రెస్క్యూ ఆపరేషన్ చేసిన తిరుచానూరు పోలీస్ స్టేషన్ కు చెందిన కానిస్టేబుల్ ప్రసాద్ పి.సి.నెంబర్ 1372, రంగస్వామి,ప్రాజెక్టు మేనేజర్ (Afcons) తిరుచానూరు రామ కృష్ణ రెడ్డి కాలనీకి చెం దిన ఎస్.శ్రీనివాసులు రెడ్డి, ఎ. రెడ్డప్ప, టి. మధు, ఉన్నారు. జవాద్ తుఫాను ప్రభావంతో స్వర్ణ ముఖి నది పొంగి ప్రవహించడం తో పాడిపేట వద్ద వర దల నుండి ప్రజలను రెస్క్యూ ఆపరేషన్ కాపాడిన బాధితుల తో ముఖ్యమంత్రి మాట్లాడారు.
జగనన్న…జగనన్న అంటూ ఆత్మీయ పలకరింపులు..
ముఖ్యమంత్రి పర్యటన సాంతం ప్రజల ఆత్మీయ పలకరింపుల మధ్య సాగింది. జగనన్నా మీ మేలు మమ్మల్ని చాలా ఆదుకుంది అంటూ బాధితులు ప్రభుత్వ సహాయ కార్యక్రమాల పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు.
ఏడు గంటలపాటు చెట్టు కొమ్మ మీద ఉండి ప్రాణాలతో బయటపడిన చిన్నా రులు అన్విత, శాన్వి త లను ముఖ్యమంత్రి ఆశీర్వదించారు.
మీ ప్రభుత్వం సకా లంలో స్పందించడం వల్లనే మేము నేడు ప్రాణాలతో ఉన్నామన్నా అని, వరదల్లో అన్నీ పోగొట్టుకున్న మాకు ఒక అన్నగా అండగా నిలిచి సాయం చేస్తున్నారని బాధితులు విజయ లక్ష్మి ముఖ్య మంత్రికి వివరించారు
వరద సాయం పొం దారని ముఖ్య మంత్రి బాధితులను అడగ గా.. వరద సాయం పొందామని సుశీల మ్మ, అనూష,రాజమ్మ, తదితరులు రెస్క్యూ ఆపరేషన్ లో ప్రాణాల ను కాపాడుకున్న వారు ముఖ్యమంత్రికి తెలిపారు.
ఈ పర్యటన సీఎం వెంట ఉప ముఖ్య మంత్రి కె.నారాయణ స్వామి, జిల్లా ఇన్ ఛార్జి మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి, పంచాయతీ రాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మాత్యులు డా. పెద్ది రెడ్డి రామచంద్రా రెడ్డి, రాజంపేట, తిరుపతి ఎంపీలు పెద్ది రెడ్డి వెంకట మిధున్ రెడ్డి, డాక్టర్ పి.గురు మూర్తి, జడ్పీ చైర్మన్ గోవిందప్ప శ్రీనివాసులు, చంద్రగిరి శాసన సభ్యులు తుడా చైర్మన్ డా.చెవి రెడ్డి భాస్కర్ రెడ్డి, తిరుపతి,శ్రీకాళహస్తి, పీలే రు, సత్యవేడు, చిత్తూరు, మదనపల్లి శాసనసభ్యులు భూమన కరుణాకర్ రెడ్డి, బియ్యపు మధు సూదన్ రెడ్డి, చింతల రామచంద్రా రెడ్డి, ఆది మూలం, ఆరణి శ్రీని వాసులు, నవాజ్ భాష, ఎం.ఎల్.సి భరత్, అనంతపురం డి ఐ జి కాంతి రాణా టాటా, జిల్లా కలెక్టర్ యం. హరి నారాయణన్, తిరుపతి అర్బన్ ఎస్ పి వెంకట అప్పలనాయుడు, జిల్లా జాయింట్ కలెక్టర్లు (రెవెన్యూ,హౌసింగ్)రాజా బాబు, వెంకటే శ్వర్, ఇతర సంబం ధిత శాఖల జిల్లా స్థాయి అధికారులు, నాయకులు ఎం ఆర్ సి రెడ్డి, విరూపాక్షి జయ చంద్రారెడ్డి, ప్రజా ప్రతినిధులు అధికారులు ఉన్నారు.
.

Discussion about this post