ఏపీ నాయీ బ్రాహ్మణ సంఘం జిల్లా ఉపాధ్యక్షులుగా శ్రీకాళహస్తికి చెందిన భాస్కర్ ను నియమించారు.
ఇటీవల మదనపల్లెలో నాయీ బ్రాహ్మణసంఘం జిల్లా కార్యవర్గ సమావేశం జరిగింది.
ఈ సందర్భంగా భాస్కర్ ను ఉపాధ్యక్షులుగా నియమిస్తూ జిల్లా అధ్యక్షులు సుబ్రహ్మణ్యం నిర్ణయం తీసుకున్నారు.
ఈ నియామకం పట్ల పలువురు హర్షం వ్యక్తం చేశారు.
కాగా ఈ సందర్భంగా భాస్కర్ మాట్లాడుతూ నాయీ బ్రాహ్మణుల అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని చెప్పారు.
.