తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారాచంద్రబాబునాయుడును ఉద్దేశించి పరుష పదజాలంతో దూషించిన రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్ఢి వెటనే క్షమాపణ చెప్పాలని ఆ పార్టీ నేతలు డిమాండు చేశారు.
ఈ మేరకు వారు శుక్రవారం శ్రీకాళహస్తిలో అంబేడ్కర్ విగ్రహానికి వినతిపత్రం సమర్పించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న సజ్జల హోదా మరచి మాట్లాడటం మంచిది కాదన్నారు.
వైసీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలతో పాటు ఆ పార్టీకి చెందిన నేతలు బూతులు మాట్లాడటం అలవాటుగా చేసుకున్నారని వారు విమర్శించారు. అసెంబ్లీలో సైతం తమ నేత చంద్రబాబును ఇలాగే మాట్లాడిన విషయం ఈ సందర్భంగా వారు గుర్తు చేశారు.
బూతులు మాట్లాడే వైసీపీ నేతలకు ప్రజలే బుద్ధి చెప్పాలని టీడీపీ నేతలు కోరారు.
ఈ కార్యక్రమంలో తొట్టంబేడు మండల అధ్యక్షులు గాలి మురళీనాయుడు, తెలుగుదేశం రాష్ట్ర కార్యదర్శి రెడ్డివారి గురవారెడ్ఢి, పురపాలక సంఘం మాజీ వైస్ ఛైర్మన్ మిన్నల రవి, ఏర్పేడు మండల అధ్యక్షులు పొన్నారావు, అస్మత్, ప్రతాప్, సుబ్రహ్మణ్యం రెడ్డి, మునిరాజా యాదవ్, మురళి, గుర్రప్ప శెట్టి, ధనుంజయనాయుడు, సన్నీ తదితరులు పాల్గొన్నారు.
.