ఫేస్ బుక్, ఇన్ స్టాగ్రామ్, వాట్సప్ సేవలు స్తంభించాయి. సోమవారం రాత్రి తొమ్మిదిన్నర గంటల తర్వాత హఠాత్తుగా ఈ సేవలు ఆగిపోయాయి. కొన్ని ప్రాంతాల్లో ఇంకా కొన్ని గంటల ముందునుంచే ఈ సేవలు ఆగిపోయినట్టుగా తెలుస్తోంది.
ఏం జరుగుతోందో తెలియక వినియోగదారులు గందరగోళానికి గురయ్యారు. నిజానికి వాట్సప్ పనిచేయడం లేదని, సేవలు అందడం లేదని గుర్తించడానికే వినియోగదారులకు చాలా సమయం పట్టింది.
ఈ మూడు సోషల్ మీడియా వేదికలు ఫేస్ బుక్ ఆధ్వర్యంలోనే నడుస్తున్న సంగతి తెలిసిందే. సర్వర్లలో సమస్య రావడం వలన.. డౌన్ అయ్యాయని, మూడు సర్వీసులు అందడం మానేశాయని తెలుస్తోంది.
ఫేస్ బుక్ గ్రూపునకే చెందిన ఫేస్ బుక్ వర్క్ ప్లేస్ వంటి యాప్స్ కూడా పనిచేయడం లేదు. పూర్తిగా ఆగిపోయాయి. ఇన్ స్టా, వాట్సప్ యాప్ లను కూడా ఫేస్ బుక్ కొనుగోలు చేసిన తర్వాత… మూడు సేవలూ ఒకే యాజమాన్యం కింద నడుస్తున్నాయి.
ఫేస్ బుక్ విజిట్ చేసిన వారికి మాత్రం.. సింపుల్ గా ఒక ఎర్రర్ మెసేజీ కనిపిస్తోంది. అయితే వాట్సప్ వాడుతున్న వారికి అలాంటి మెసేజీ కూడా ఏదీ రావడం లేదు గానీ.. మెసేజీలు డెలివర్ కావడం, పంపిన మెసేజీలకు కనీసం సింగిల్ టిక్ మార్కు రావడం జరగడం లేదు.
ప్రపంచంలోనే కొన్ని వందల కోట్ల మంది వినియోగదారులకు సేవలందిస్తున్న ఈ మూడు యాప్ లు ఒక్కసారిగా స్తంభించిపోవడం విశేషం. అయితే ఈ యాప్ ల సేవలు నిలిచిపోవడంపై ఫేస్ బుక్ స్పందించలేదు. వివరణ ఇవ్వలేదు.
2019లో ఫేస్ బుక్ చాలా పెద్ద సమస్యను ఎదుర్కొంది. అప్పట్లోనే వాళ్లు చాలా సింపుల్ గా.. రొటీన్ మెయింటెనెన్స్ ఆపరేషన్స్ లో చిన్న సమస్య వచ్చింది అని మాత్రమే చెప్పారు.
మార్క్ జుకర్ బర్గ్ 2019లో ది వెర్జ్ పత్రికలో ఇలా అన్నారు. ‘ఇలాంటి సమస్యలు అనేవి చాలా పెద్దవి. వీటి వలన వినియోగదారులు పోటీదారులైన యాప్ లకు అలవాటు పడడం జరుగుతుంది. అలా జరిగితే తిరిగి పూర్తిస్థాయిలో వినియోగదార్లను రాబట్టుకోవడం కష్టమవుతుంది’ అన్నారు.
ఇప్పుడు మొత్తం మూడింటికీ కలిపి… ఫేస్ బుక్, వాట్సప్, ఇన్ స్టాలకు కలిపి ఒకేసారి సేవలు నిలిచిపోవడం అనేది ఇంకా పెద్ద సమస్యగానే చెప్పాలి.
ఇవి కూడా చదవండి :
మిత్రులకు ‘శుభోదయం’ సందేశాలు పంపడానికి సుభాషితాలు ఎంచుకోండి..
సినిమా ఇండస్ట్రీలో అరాచక విశృంఖలపోకడలపై సీనియర్ జర్నలిస్ట్ ‘రామ్’బాణం
వేదనలో సమంత.. లొకేషన్ లోనే కన్నీళ్లు పెట్టుకున్న వైనం
movie review : కంటతడి పెట్టించే సినిమా ‘రిపబ్లిక్’
కేబినెట్ ప్రక్షాళన ఒక సమరం : జగన్ vs ముగ్గురు బలమైన మంత్రులు
రోజా సీటు కింద పెద్దిరెడ్డి కుంపటి రాజేస్తున్నారా
అరెస్టు నుంచి రక్షణ కవచం.. సిఆర్‌పిసి 41 (ఎ)
పవన్ కల్యాణ్ పై పోసాని ఆగ్రహం న్యాయమే
టీటీడీ బోర్డు భ్రష్టు పట్టిపోయిన చరిత్ర – పార్ట్ 1
టీటీడీ బోర్డు భ్రష్టు పట్టిపోయిన చరిత్ర – పార్ట్ 2
పవన్ కల్యాణ్ ఒంటరి అయిపోయాడా?
.