• About Us
  • Contact Us
  • Our Team
Monday, July 27, 2026
Adarsini
  • .
  • Politics
    • Andhrapradesh
    • Telangaana
  • General
  • Edit Page
    • Editorial
    • Dr Govindaraju Chakradhar
    • Beeraka Ravi
    • Dr. S Ramu
    • MV Rami Reddy
    • Suresh Pillai
    • MLN Murty
    • Deviprasad Obbu
    • Others
  • Movies
  • Cine Reviews
  • Photos
  • Videos
  • Special
    • Subhashitham
    • Short Stories
    • Poems
    • Short Films
  • LOCAL
    • Tirumala
    • Chittoor
    • Srikalahasti
    • Tirupati
    • Chandragiri
    • Kuppam
    • Palamaneru
    • Satyavedu
    • Nagari
    • Puthalapattu
    • Tamballapalle
    • Punganuru
  • E-Paper
No Result
View All Result
Adarsini
  • .
  • Politics
    • Andhrapradesh
    • Telangaana
  • General
  • Edit Page
    • Editorial
    • Dr Govindaraju Chakradhar
    • Beeraka Ravi
    • Dr. S Ramu
    • MV Rami Reddy
    • Suresh Pillai
    • MLN Murty
    • Deviprasad Obbu
    • Others
  • Movies
  • Cine Reviews
  • Photos
  • Videos
  • Special
    • Subhashitham
    • Short Stories
    • Poems
    • Short Films
  • LOCAL
    • Tirumala
    • Chittoor
    • Srikalahasti
    • Tirupati
    • Chandragiri
    • Kuppam
    • Palamaneru
    • Satyavedu
    • Nagari
    • Puthalapattu
    • Tamballapalle
    • Punganuru
  • E-Paper
No Result
View All Result
Adarsini
No Result
View All Result

Good Morning : లోపలి చూపు ఉండాలి..

admin by admin
November 27, 2021
0
Good Morning : లోపలి చూపు ఉండాలి..

మనలో లోపాలను ఇతరులు గుర్తించి చెప్పినప్పుడు మనకు కాస్త బాధ కలుగుతుంది. ఎంతటి స్థితప్రజ్ఞులకైనా ఇలాంటి బాధ కొంచెమైనా ఉంటుంది. అయితే లోపాలను తెలుసుకోకపోతే.. మనల్ని మనం దిద్దుకోవడం ఎలాగ? మన లోపాలను మనమే తెలుసుకునే ప్రయత్నం చేయాలి. చేస్తే.. మనకంటె బాగా వాటిని కనిపెట్టగలవారు మరొకరు ఉండరు. కనిపెట్టాలంటే.. మనకు లోపలి చూపు ఉండాలి. అంతఃవీక్షణం జరగాలి.

ఉదయం లేవగానే భగవంతుడిని ప్రార్థించాలని కొందరు చెబుతారు. ఉదయం లేవగానే ఇవాళ ఏం పనులు చేయాలనుకుంటున్నామో వాటి మంచి చెడులేమిటో ఒకసారి మననం చేసుకోవాలని కొందరు చెబుతారు. ఇలాంటి సలహాలు అనేకం ఉంటాయి. ఇదే తరహాలో రాత్రి పడుకునే ముందు ఓసారి లోపలిచూపు కలిగి ఉండడం ముఖ్యం. మనం పగలంతా ఏం పనులు చేశామో.. వాటిలో మంచి చెడులేమిటో తూకం వేసుకోవడం అవసరం. ఇలా రోజూ చేసిన పనులను గుర్తు  చేసుకుంటే చాలు.. కొన్నాళ్లకు మన ప్రవర్తనే మంచి పనులు మాత్రమే చేసే తీరుగా తయారవుతుంది.

ఇదే విషయాన్ని ఓ సుభాషితం ఇలా చెబుతుంది.

ప్రత్యహం ప్రత్యవేక్షేత్ నరశ్చరితమాత్మనః
కిన్ను మే పశుభిస్తుల్యం కిన్ను సత్పురుషైరితి

ప్రతిరోజూ కూడా మనం మన ప్రవర్తన గురించి లోపలిచూపు కలిగి ఉండాలి. అంతస్సమీక్ష ఉండాలి. నాలోని ఏ లక్షణాలు పశువు లక్షణాలతో పోలి ఉన్నాయి. నాలో ఏ లక్షణాలు మంచివాళ్లతో పోలి ఉన్నాయి.. అని మనం ప్రతిరోజూ ఆత్మ సమీక్ష చేసుకోవాలి. ఆ రకంగా మనలో ఉండే మంచి లక్షణాలను వెలికి తీసుకురావాలి. -అనేది శ్లోకభావం.

లోపలి చూపు అనేది ప్రతి మనిషికీ చాలా ముఖ్యం. మనలోని మంచి చెడుల గురించి గానీ.. మనలోని సమర్థత చేతగానితనం గురించి గానీ.. బయటినుంచి చూసే ఎంతటి వారికంటె మనకే బాగా అర్థమవుతుంది. Introspection అంటాం మనం. ప్రతి మనిషికీ దాని అవసరం చాలా ఉంది.

లోపలి చూపు అనేది కేవలం పశు (చెడు) లక్షణాలు- మంచి లక్షణాలకు సంబంధించి మాత్రమే కాదు. మన శక్తి సామర్థ్యాల విషయంలో కూడా ఇలాంటి లోపలిచూపు అవసరం.  మనం ఏదైనా వ్యాపారమో, జీవితంతో ప్రయోగమో చేయాలనుకున్నప్పుడు.. ముందు మన శక్తి ఎంతో చూసుకోవాలి. దానికంటెముందు మన శక్తి హీనత, బలహీనత ఏమిటో పరీక్షించుకోవాలి. ఆ తర్వాతే ఆ ప్రయోగానికి పూనుకుంటే వైఫల్యం ఉండదు. ప్రతి విషయంలోనూ ఈ సిద్ధాంతం పనిచేస్తుంది. నిరంతరమైన లోపలిచూపు మనల్ని మరింతగా క్రియాశీలంగా, సమర్థంగా తయారుచేస్తుంది.

శుభోదయం.

కేసీఆర్.. ఫాంహౌస్ వైభవం గతించిపోయినట్టేనా?

జగనన్న అనుచరుడు.. షర్మిల పార్టీలోకి!

ఎమ్మెల్యేపై పగ.. జగన్ మామయ్యకు సెగ!

షర్మిల : అన్నయ్యను అడగలేదేం చెల్లెమ్మా!

Tags: BhartrihariBhartrihari subhashithamgood morninggood morning thoughtinner viewintrospectionquotes on agriculturequotes on good thoughtssubhashitamsubhashithamwhat to sowwhat you sow is what you reapభర్తృహరి సుభాషితంమంచిమాటశుభోదయంసుభాషితం
Subscribe
Login
Notify of
guest
Optional

guest

0 Comments
Oldest
Newest Most Voted

Top Read Stories

28 జూన్ 2026 కథానిధి : ఆదివారం కథల సంకలనం

5 జులై 2026 కథానిధి : ఆదివారం కథల సంకలనం

19.7.26 కథానిధి సమీక్ష: సమకాలీన కల్లోల జీవిత చిత్రణ

28.6.26 ‘కథానిధి’ సమీక్ష: వర్తమాన సామాజిక వాస్తవికత

12 జులై 2026 కథానిధి : ఆదివారం కథల సంకలనం

5.7.26 ‘కథానిధి’ సమీక్ష: సామాజిక రుగ్మతలపై అక్షరాల తిరుగుబాటు

VIDEO

https://www.youtube.com/watch?v=4IsF6u52r8o&autoplay=1&mute=1
Adarsini

© 2021 ADARSINI | Designed By 10gminds software solutions

Navigate Site

  • About Us
  • Contact Us
  • Our Team

Follow Us

No Result
View All Result
  • .
  • Politics
    • Andhrapradesh
    • Telangaana
  • General
  • Edit Page
    • Editorial
    • Dr Govindaraju Chakradhar
    • Beeraka Ravi
    • Dr. S Ramu
    • MV Rami Reddy
    • Suresh Pillai
    • MLN Murty
    • Deviprasad Obbu
    • Others
  • Movies
  • Cine Reviews
  • Photos
  • Videos
  • Special
    • Subhashitham
    • Short Stories
    • Poems
    • Short Films
  • LOCAL
    • Tirumala
    • Chittoor
    • Srikalahasti
    • Tirupati
    • Chandragiri
    • Kuppam
    • Palamaneru
    • Satyavedu
    • Nagari
    • Puthalapattu
    • Tamballapalle
    • Punganuru
  • E-Paper

© 2021 ADARSINI | Designed By 10gminds software solutions

error: adarsini.com Content is protected !!
wpDiscuz
0
0
Would love your thoughts, please comment.x
()
x
| Reply