• About Us
  • Contact Us
  • Our Team
Wednesday, August 12, 2026
Adarsini
  • .
  • Politics
    • Andhrapradesh
    • Telangaana
  • General
  • Edit Page
    • Editorial
    • Dr Govindaraju Chakradhar
    • Beeraka Ravi
    • Dr. S Ramu
    • MV Rami Reddy
    • Suresh Pillai
    • MLN Murty
    • Deviprasad Obbu
    • Others
  • Movies
  • Cine Reviews
  • Photos
  • Videos
  • Special
    • Subhashitham
    • Short Stories
    • Poems
    • Short Films
  • LOCAL
    • Tirumala
    • Chittoor
    • Srikalahasti
    • Tirupati
    • Chandragiri
    • Kuppam
    • Palamaneru
    • Satyavedu
    • Nagari
    • Puthalapattu
    • Tamballapalle
    • Punganuru
  • E-Paper
No Result
View All Result
Adarsini
  • .
  • Politics
    • Andhrapradesh
    • Telangaana
  • General
  • Edit Page
    • Editorial
    • Dr Govindaraju Chakradhar
    • Beeraka Ravi
    • Dr. S Ramu
    • MV Rami Reddy
    • Suresh Pillai
    • MLN Murty
    • Deviprasad Obbu
    • Others
  • Movies
  • Cine Reviews
  • Photos
  • Videos
  • Special
    • Subhashitham
    • Short Stories
    • Poems
    • Short Films
  • LOCAL
    • Tirumala
    • Chittoor
    • Srikalahasti
    • Tirupati
    • Chandragiri
    • Kuppam
    • Palamaneru
    • Satyavedu
    • Nagari
    • Puthalapattu
    • Tamballapalle
    • Punganuru
  • E-Paper
No Result
View All Result
Adarsini
No Result
View All Result

అందరి కోరిక బరువు తగ్గాలనే.. కానీ..

admin by admin
October 8, 2021
0
అందరి కోరిక బరువు తగ్గాలనే.. కానీ..

ఇప్పుడు అందరినోటా ఒకటే మాట… అదే బరువు తగ్గాలి. ఎవరు చూసినా ఒబేసిటీ, అదే… అధిక బరువుతో బాధపడుతున్నవారే. బరువు అనేది మనకేమీ ఆస్థికాదు. దానివల్ల మనకు ఎలాంటి ప్రయోజనం కూడా లేదు. ప్రయోజనం లేకపోగా మనకు ప్రమాదమని మాత్రం ఖచ్చితం. అధిక బరువు వల్ల మన శరీర ఆరోగ్యం దెబ్బతింటుంది.

చిన్నవయసులోనే అధిక బరువు కారణంగా మోకాళ్ల నొప్పులు వంటి సమస్యలతోబాటు మేమూ ఉన్నామంటూ రక్తపోటు, మధుమేహం కూడా ముంచుకొస్తాయి. దీంతో చిన్న వయసునుండే ఈ రెండు వ్యాధులను అదుపులో ఉంచుకోవడంకోసం మనం టాబ్లెట్లు మింగక తప్పని పరిస్థితి. అందుకే ముందుజాగ్రత్తగా బరువును అదుపులో ఉంచుకుంటే కనీసం కొంతకాలమైనా మనం మరింత ఆరోగ్యంగా ఉండవచ్చని నేటి తరం ఆలోచిస్తున్నారు.

ఇందులో భాగంగానే చాలామంది జిమ్ములు, యోగా సెంటర్ల చుట్టూ తిరుగుతూ వేలకు వేలు ఖర్చు చేస్తున్నారు. అయితే నిజంగా బరువు తగ్గాలి అనుకునేవారు వీటితోబాటు తమ ఆహారంలో కొద్దిపాటి మార్పులు చేసుకుంటే మరింత ప్రయోజనం ఉంటుంది. అయితే కొందరు మిగిలిన వారిలాగా జిమ్ములు, యోగా సెంటర్లకు వెళ్లడానికి తగిన ఆర్ధిక స్థోమత వారికి సహకరించదు. ఇలాంటి వారు మాత్రం తమ ఆహారంలో చిన్న పాటి మార్పులు చేసుకుని ఇంట్లోనే తేలికపాటి వ్యాయామాలు తరచూ చేస్తుంటే తమ ఆరోగ్యాన్ని, ఆకృతిని కూడా చక్కగా కాపాడుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు.

ప్రకృతిలో మనకు లభించే పలురకాలైన పండ్లను మన ఆహారంలో భాగంగా చేసుకోవడం వల్ల మనం మరింత ఆరోగ్యంగా ఉండవచ్చు. అందులో ముఖ్యంగా చెప్పవలసింది ఆపిల్ పండ్లు.

ఇప్పటికే మనకు అందరికీ తెలిసిన నానుడి ఉండనే ఉంది. రోజూ ఒక ఆపిల్ పండు తినడం వల్ల మనం డాక్టర్ ని కలవాల్సిన అవసరం ఉండదని మనం తరచూ వింటూనే ఉంటాం. ఇప్పుడు కూడా అదే చెప్పుకోవాలి. మనం రోజూ తినే ఆహారం పరిమాణాన్ని కాస్త తగ్గించుకుని దానికి బదులుగా ఆపిల్ పండును చేర్చుకుంటే మంచిది. అది పండు రూపంలోనైనా, లేదా సలాడ్ రూపంలోనూనా మొత్తానికి యాపిల్ పండును మన ఆహారంలో భాగం చేర్చుకోవాలి.

ఇవి కూడా చదవండి :
జనంమెచ్చిన సీఎం.. ఆడు మగాడ్రా బుజ్జీ
పవర్ స్టార్ పవన్ = గ్యాంగ్‌స్టర్ నయీమ్.. ఎలాగో తెలుసా?
అభిమానులు ఊహించని స్టెప్ వేసిన జనసేనాని

ఈ పండులో పుష్కలమైన పీచుపదార్ధం కారణంగా దీన్ని తిన్న తరువాత మనకు కడుపు నిండిన భావన కలుగుతుంది. అంతేకాదు, మన ఆకలిని కొంతవరకు ఇది నిలుపగలదు. ఇందులో ఉన్న విటమిన్ సి, మరియు యాంటీ ఆక్సిడెంట్లు మన ఆరోగ్యానికి చాలా అవసరం. మనం ఉదయం ఆహారం తీసుకున్న తరువాత మరలా మధ్యాహ్నం భోజన సమయానికన్నా ముందుగా మనకు ఒక్కోసారి ఆకలి వేస్తుంది.

అలాంటప్పుడు మనం ఏదో బజారులో దొరికే స్నాక్స్ ని చక్కగా తినేస్తాం. దీనివల్ల బరువు తగ్గాలనుకునే మన లక్ష్యం నెరవేరకపోగా బరువు పెరుగుతాం. అందుకే అలాకాకుండా ఇలా మనకు ఆకలి అనిపించినప్పుడు చక్కగా ఒక యాపిల్ పండును కోసేసుకు తినేయండి, ఆరోగ్యానికి ఆరోగ్యం, ఆకలిని అదుపు ఉంటుంది.

ఇవి కూడా చదవండి :
satire : అర్ధరాత్రి గునపం దరువులు
ప్రజల్లో లోపమే.. ఇష్టారీతిగా ధరల పెంపుదలకు కారణమా?
కేబినెట్ ప్రక్షాళన ఒక సమరం :   జగన్ vs ముగ్గురు బలమైన మంత్రులు
అరెస్టు నుంచి రక్షణ కవచం.. సిఆర్‌పిసి 41 (ఎ)
టీటీడీ బోర్డు భ్రష్టు పట్టిపోయిన చరిత్ర – పార్ట్ 1
టీటీడీ బోర్డు భ్రష్టు పట్టిపోయిన చరిత్ర – పార్ట్ 2
గ్యాంగ్ స్టర్ నయీమ్ అనుచరుడే వంద కోట్లు సంపాదించాడంటే…?

రెండో పండు అవకాడో. ఈ అవకాడో పండు మిగిలిన పండ్లకంటే కాస్త భిన్నంగా ఉంటుంది. ఇందులో పిండిపదార్ధకు బదులుగా మన ఆరోగ్యానికి ఉపకరించే కొవ్వు పదార్ధాలు ఉంటాయి. అంతేకాకుండా ఇందులో కూడా ఫైబర్, పొటాషియం, విటమిన్ సి కూడా అధికంగానే ఉంటాయి. ఇవి మన శరీరానికి ఎంతైనా అవసరం. శరీరానికి రోగ నిరోధక శక్తిని పెంపొందించడంలో విటమిన్ సి ఎంతైనా అవసరం అని మనకు తెలిసిందే.

మరో పండు అరటిపండు. ఇది మన అందరికీ అందుబాటులో ఉండే పండే. ఇందులో ముఖ్యంగా చెప్పాలంటే పొటాషియం అధికంగా ఉండే పండుగా చెప్పవచ్చు. దీనితోబాటు విటమిన్ బి6, ఫైబర్ ఈ పండులో పుష్కలంగా ఉంటాయి. ఫైబర్ ఉన్న పండ్లు మన జీర్ణవ్యవస్థకు ఎంతగానో ఉపకరిస్తాయని చెప్పాల్సిన పనిలేదు.

ఆరెంజ్ పండ్లు అంటే ఇష్టపడని వారు తక్కువే. అందరికీ ఇవి చాలా ఇష్టమైన పండ్లుగా చెప్పవచ్చు. రుచికి రుచితోబాటు మనకు మంచి రోగ నిరోధక శక్తిని పెంచే విటమిన్ సి పుష్కలంగా లభించే పండ్లుగా వీటిని చెబుతారు. వీటిలో యాంటీ ఆక్సిడెంట్లు కూడా ఎక్కువగా ఉంటాయి.

ఇలా మనకు చాలా పుష్కలంగా లభించే పండ్లతో చెప్పుకోదగినది జామ. దీన్ని పేదవాడి యాపిల్ గా చెబుతారు. ఈ పండులో పుష్కలమైన యీంటీ ఆక్సిడెంట్లతోబాటు ఎక్కువ మొత్తంలో ఫైబర్, పొటాషియం ఉన్నాయి. ఇది అనేకరకాలైన ఆరోగ్య ప్రయోజనాలను అందించే పోషకాహారంగా చెప్పవచ్చు.

ఇలా మన చుట్టూ ఉన్న ప్రకృతిలో లభించే అనేకరకాలైన పండ్లను మన ఆహారంలో భాగంగా చేసుకోవడం వల్ల కూడా మనం వేగంగా, ఆరోగ్యవంతంగా బరువు తగ్గవచ్చు. అయితే బరువు తగ్గాలి అనుకునేవారు కేవలం ఆహారపు అలవాట్లను మార్చుకుంటే సరిపోదు. దానికి అనుగుణంగా వ్యాయామపు అలవాట్లను కూడా అలవరచుకుంటే మరింత ఆరోగ్యకరంగా మనం బరువు తగ్గవచ్చు, మరింత ఆరోగ్యంగా ఉండవచ్చు… ఏమంటారు?

Tags: fruits for healthfruits for obesitygood healthhealthhealth pointshealth tipsobesityపండ్లతో బరువు తగ్గండి
Subscribe
Login
Notify of
guest
Optional

guest

0 Comments
Oldest
Newest Most Voted

Top Read Stories

19.7.26 కథానిధి సమీక్ష: సమకాలీన కల్లోల జీవిత చిత్రణ

12 జులై 2026 కథానిధి : ఆదివారం కథల సంకలనం

26.7.26 కథానిధి సమీక్ష: సమకాలీన సామాజిక సంక్షోభాల సజీవ చిత్రణ

ఆర్టీసీకి జరిమానా : ఇలా చేస్తే ప్రజలకే నష్టం!!

సురేష్ పిళ్లె: చదువులు వెలుగుతున్నాయా? తగలబడుతున్నాయా?

12.7.26 ‘కథానిధి’ సమీక్ష: సమకాలీన జీవిత వైరుధ్యాలు

VIDEO

https://www.youtube.com/watch?v=4IsF6u52r8o&autoplay=1&mute=1
Adarsini

© 2021 ADARSINI | Designed By 10gminds software solutions

Navigate Site

  • About Us
  • Contact Us
  • Our Team

Follow Us

No Result
View All Result
  • .
  • Politics
    • Andhrapradesh
    • Telangaana
  • General
  • Edit Page
    • Editorial
    • Dr Govindaraju Chakradhar
    • Beeraka Ravi
    • Dr. S Ramu
    • MV Rami Reddy
    • Suresh Pillai
    • MLN Murty
    • Deviprasad Obbu
    • Others
  • Movies
  • Cine Reviews
  • Photos
  • Videos
  • Special
    • Subhashitham
    • Short Stories
    • Poems
    • Short Films
  • LOCAL
    • Tirumala
    • Chittoor
    • Srikalahasti
    • Tirupati
    • Chandragiri
    • Kuppam
    • Palamaneru
    • Satyavedu
    • Nagari
    • Puthalapattu
    • Tamballapalle
    • Punganuru
  • E-Paper

© 2021 ADARSINI | Designed By 10gminds software solutions

error: adarsini.com Content is protected !!
wpDiscuz
0
0
Would love your thoughts, please comment.x
()
x
| Reply