• About Us
  • Contact Us
  • Our Team
Tuesday, September 22, 2026
Adarsini
  • .
  • Politics
    • Andhrapradesh
    • Telangaana
  • General
  • Edit Page
    • Editorial
    • Dr Govindaraju Chakradhar
    • Beeraka Ravi
    • Dr. S Ramu
    • MV Rami Reddy
    • Suresh Pillai
    • MLN Murty
    • Deviprasad Obbu
    • Others
  • Movies
  • Cine Reviews
  • Photos
  • Videos
  • Special
    • Subhashitham
    • Short Stories
    • Poems
    • Short Films
  • LOCAL
    • Tirumala
    • Chittoor
    • Srikalahasti
    • Tirupati
    • Chandragiri
    • Kuppam
    • Palamaneru
    • Satyavedu
    • Nagari
    • Puthalapattu
    • Tamballapalle
    • Punganuru
  • E-Paper
No Result
View All Result
Adarsini
  • .
  • Politics
    • Andhrapradesh
    • Telangaana
  • General
  • Edit Page
    • Editorial
    • Dr Govindaraju Chakradhar
    • Beeraka Ravi
    • Dr. S Ramu
    • MV Rami Reddy
    • Suresh Pillai
    • MLN Murty
    • Deviprasad Obbu
    • Others
  • Movies
  • Cine Reviews
  • Photos
  • Videos
  • Special
    • Subhashitham
    • Short Stories
    • Poems
    • Short Films
  • LOCAL
    • Tirumala
    • Chittoor
    • Srikalahasti
    • Tirupati
    • Chandragiri
    • Kuppam
    • Palamaneru
    • Satyavedu
    • Nagari
    • Puthalapattu
    • Tamballapalle
    • Punganuru
  • E-Paper
No Result
View All Result
Adarsini
No Result
View All Result

లోపలిమాట: మంటగలుస్తున్న మానవ సంబంధాలు

admin by admin
October 10, 2021
0
లోపలిమాట: మంటగలుస్తున్న మానవ సంబంధాలు

ఏ బంధమైనా నమ్మకం మీదే నిలబడుతుంది. కానీ, ఆ నమ్మకమే ఇప్పుడు నిలబడలేక నానా అవస్థలు పడుతోంది. ఎందుకంటే ఇప్పటి సమాజంలో ఎవరికీ ఎవరిమీద నమ్మకాలు లేవు. ఉన్నదంతా అపనమ్మకమే.

దానికి కారణం ఇతరుల ఇష్టాయిష్టాలతో నిమిత్తం లేకుండా తమకు నచ్చినట్లు తాము ఉండాలని ఎవరికివారు మంచిచెడు ఆలోచించకుండా, పెద్దచిన్నా లెక్కచేయకుండా హద్దుమీరి ప్రవరిస్తూ.. పచ్చిగా చెప్పాలంటే, ‘బరితెగించి’ బతకాలని అనుకోవడమే. దానికి వాళ్ళు పెట్టుకున్న అందమైన పేరు ‘స్వేచ్ఛ’. అది స్వేచ్ఛ ఎలా అవుతుంది.

అసలు స్వేచ్ఛ అంటే ఏమిటి?

నిర్భయత్వమే స్వేచ్ఛ. నిర్భయత్వము ఎప్పుడు వస్తుంది? మనం పారదర్శకంగా ఉన్నప్పుడు. పారదర్శకత అంటే మనసా, వాచా, కర్మణా ఒకేవిధంగా ఉండగలగడం. అంటే మనసులో ఉన్నదే బయటకు చెప్పగలగడం, చెప్పిందే చేయగలగడం. అలా ఉండగలగడమే అసలైన స్వేచ్ఛ.

ఎందుకంటే అప్పుడు మనం ఎవరికీ భయపడాల్సిన అవసరం ఉండదు. ఈ మూడింటిలో ఏది లోపించినా మనం స్వేచ్ఛ కోల్పోయిన వాళ్ళమే అవుతాం. అప్పుడు ఏదోక సందర్భంలో ఇతరుల ఎదుట అవమానాలు పాలవ్వాల్సిన అగత్యం ఏర్పడుతుంది.

ఎలాగంటే…

ఉదాహణకు: నీవు బస్టాండులో ఉన్నావనుకో. అప్పుడు మీ స్నేహితుడు ఫోనుచేసి ‘ఎక్కడున్నావురా’ అని అడిగాడు అనుకోండి. అప్పుడు మీరు ‘నేను వేరే ఊరిలో ఉన్నాను’ అని అబద్ధం చెప్పావనుకో. కాసేపటి తర్వాత ఆ స్నేహితుడు ఆ బస్టాండులోనే నీకు ఎదురుపడితే అప్పుడు నీ పరిస్థితి ఏంటి? ఖచ్చితంగా అప్పుడు అతని ముందు నీవు తలదించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అంతేకాదు ఒక్కోసారి అబద్దం చెప్పడంవల్ల మనుషుల మధ్య బంధాలకు బీటలు వారే పరిస్థితి కూడా ఏర్పడుతుంది.

నేటి సమాజంలో మనుషుల మధ్య సంబంధాలు మంటగలవడానికి నూటికి తొంభైశాతం కారణం ఏంటంటే సాంకేతికతేనని మనం అంగీకరించక తప్పదు. అందులోనూ ప్రధమ స్థానం సెల్ ఫోనేనని అనటానికి నేను ఏ మాత్రం సందేహించను.

ఎలాగంటే..

ఉదారణకు: మనం ఫోనులో పెట్టే సందేశాలు, మాట్లాడే సంభాషణలు ప్రతీదీ రికార్డ్ అవుతుందనే విషయం చాలామందికి తెలియదు. అందుకని ఇష్టమొచ్చిన సందేశాలు పెట్టడం, నోటికొచ్చినట్లు మాట్లాడడం చేస్తుంటారు చాలామంది. ఆ తర్వాత పెట్టిన సందేశాలు డిలిట్ చేసేసి ఆనందపడిపోతుంటారు. కానీ, మనం పెట్టే సందేశాలు, వీడియోలు, సంభాషణలు ప్రతిదీ సంబంధిత యాప్లో నిక్షిప్తమవుతుంది. ఈ సమాచారం ఆధారంగానే పోలీసులు నేరస్తులను గుర్తించి వాళ్ళను పట్టుకొంటారు.

అంతేకాదు మనం సంభాషించిన ఎదుట వ్యక్తులు కూడా మనం పెట్టే సందేశాలు, మాట్లాడిన సంభాషణలు రికార్డు చేసే అవకాశం ఉంది. దానివల్ల వాళ్ళకొచ్చిన ఉపయోగం ఏమిటంటే భవిష్యత్తులో వాళ్ళకు, మనకు వివాదాలు తలెత్తినప్పుడు అవి బయటపెట్టి మనల్ని అభాసుపాలు చేసే అవకాశం ఉంటుంది. అందువల్ల ఫోనులో మాట్లాడేటప్పుడు తగు జాగురూకతతో ఆచీతూచీ వ్యవహరించాలి.

అలాగే…
నేడు అందరిమీద సోషియల్ మీడియా ప్రభావం విపరీతంగా ఉంది. ముఖ్యంగా యువతీయువకులు ముక్కుమోహం తెలియని వ్యక్తులతో చాటింగ్ చేయడం, వ్యక్తిగత సమాచారం అందివ్వడం, సన్నిహితంగా మెలగడం వంటి కారణాలవల్ల సదరు వ్యక్తులు బ్లాక్ మెయిల్ చేసి తమకు కావలసిన భౌతికావసరాలు తీర్చుకోవడంతోపాటు మోసాలకు కూడా పాల్పడుతున్నారు. ఆ కారణంగా మోసపోయిన వ్యక్తులు విషయాన్ని బయటకు చెప్పుకోలేక ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు.

ఇవి కూడా చదవండి :
Movie Review : తప్పక చూడదగిన చిత్రం క్రిష్-వైష్ణవ్ తేజ్ ‘కొండపొలం’
జనంమెచ్చిన సీఎం.. ఆడు మగాడ్రా బుజ్జీ
పవర్ స్టార్ పవన్ = గ్యాంగ్‌స్టర్ నయీమ్.. ఎలాగో తెలుసా?
అభిమానులు ఊహించని స్టెప్ వేసిన జనసేనాని

కుటుంబ వ్యవస్థపై సెల్ ఫోను తీవ్ర ప్రభావం చూపుతోంది. ఎలాగంటే సెల్ ఫోనులో ప్రైవసీ( గోప్యత) అనే ఒక ఆప్షన్ ఉంటుంది. గోప్యత అంటే వ్యక్తిగతమైన అని అర్థం. ఏ విషయాన్ని ఇతరులకు తెలియకుండా తనలోనే దాచుకోవడం. అదే ఇప్పుడు అనేక అనర్థాలకు దారితీస్తోంది. కుటుంబంలో ఇప్పుడు అందరికీ సెల్ ఫోను ఉంది. ఈ ప్రైవసీ సాకుతో కుటుంబంలో ఎవరూ ఒకరి ఫోను మరొకరి చూపరు. ఎవరికివారు ఫోను చేతిలో పెట్టుకుని తలా ఒక దిక్కులో కూర్చుని దిక్కుమాలిన సందేశాలు, వీడియోలు, సంభాషణలు సాగిస్తూ ఉండడంచేత మనుషుల మధ్య మాటలు కరువౌతున్నాయి. తద్వారా మనుషుల మధ్య అనుమానం, అపనమ్మకం అనే అఘాతాలు ఏర్పడి బంధాలు అవహేళనకు గురి అవున్నాయి.

కాబట్టి…
పిల్లల పట్ల తల్లిదండ్రులు జాగ్రత్తగా ఉండడం మంచిది. పిల్లల ప్రవర్తనను, మానసికస్థితిని ఎప్పటికప్పుడు తల్లిదండ్రులు గమనిస్తూ ఉండాలి. వాళ్ళ ప్రవర్తనలో తేడా కనిపిస్తే, వెంటనే కారణాలు కనుక్కుని సత్వరమే పరిష్కరించాలి. లేకపోతే అనర్థాలను చవిచూడాల్సి వస్తుంది. అలాగే పెద్దలు కూడా సాధ్యమైనంతవరకు సెల్ ఫోను వినియోగాన్ని తగ్గించి, ఆ సమయాన్ని మన తల్లిదండ్రులతోను, భార్యాబిడ్డలతోను గడిపితే బంధాలు బలపడుతాయి. లేకపోతే కుటుంబ కలహాలు, హత్యలు, ఆత్మహత్యలు పెరిగిపోయి మానవ సంబంధాలు మంటగలిసిపోయే ప్రమాదం ఉంది.

…దేవీప్రసాద్ ఒబ్బు
9866251159.

ఇవి కూడా చదవండి :
హవ్వ.. రాజగురువు చెప్పినట్టే టీటీడీ ఆడుతోందా? 
ప్రజల్లో లోపమే.. ఇష్టారీతిగా ధరల పెంపుదలకు కారణమా?
కేబినెట్ ప్రక్షాళన ఒక సమరం :   జగన్ vs ముగ్గురు బలమైన మంత్రులు
అరెస్టు నుంచి రక్షణ కవచం.. సిఆర్‌పిసి 41 (ఎ)
టీటీడీ బోర్డు భ్రష్టు పట్టిపోయిన చరిత్ర – పార్ట్ 1
టీటీడీ బోర్డు భ్రష్టు పట్టిపోయిన చరిత్ర – పార్ట్ 2
గ్యాంగ్ స్టర్ నయీమ్ అనుచరుడే వంద కోట్లు సంపాదించాడంటే…?

 

Tags: deviprasaddeviprasad obbuhuman relationslopalimataobbu deviprasad
Subscribe
Login
Notify of
guest
Optional

guest

0 Comments
Oldest
Newest Most Voted

Top Read Stories

‘యుద్ధాలు బలికోరేది మానవత్వాన్నేనా?’

23 ఆగస్టు 2026 కథానిధి : ఆదివారం కథల సంకలనం

చాగంటి ప్రసాద్: యతో కృష్ణ స్తతో జయః

13.9.26 కథానిధి సమీక్ష: మానవ సంబంధాలు అక్షరబద్ధం

సురేష్ పిళ్లె: ఘనీభవన స్థితి ‘కడెవర్ భారతి’

30.8.26 కథానిధి సమీక్ష: మనిషిని వెతుకుతున్న కథలు

VIDEO

https://www.youtube.com/watch?v=4IsF6u52r8o&autoplay=1&mute=1
Adarsini

© 2021 ADARSINI | Designed By 10gminds software solutions

Navigate Site

  • About Us
  • Contact Us
  • Our Team

Follow Us

No Result
View All Result
  • .
  • Politics
    • Andhrapradesh
    • Telangaana
  • General
  • Edit Page
    • Editorial
    • Dr Govindaraju Chakradhar
    • Beeraka Ravi
    • Dr. S Ramu
    • MV Rami Reddy
    • Suresh Pillai
    • MLN Murty
    • Deviprasad Obbu
    • Others
  • Movies
  • Cine Reviews
  • Photos
  • Videos
  • Special
    • Subhashitham
    • Short Stories
    • Poems
    • Short Films
  • LOCAL
    • Tirumala
    • Chittoor
    • Srikalahasti
    • Tirupati
    • Chandragiri
    • Kuppam
    • Palamaneru
    • Satyavedu
    • Nagari
    • Puthalapattu
    • Tamballapalle
    • Punganuru
  • E-Paper

© 2021 ADARSINI | Designed By 10gminds software solutions

error: adarsini.com Content is protected !!
wpDiscuz
0
0
Would love your thoughts, please comment.x
()
x
| Reply