నగరి నియోజవర్గం పుత్తూరు మండలం తడుకు పంచాయతీ గ్రామంలో భారతీయ జనతా పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యురాలు యం. నిషీధ రాజు పర్యటించారు.
ఎగువ గూలూరులో మురికి కాలువ పొలంలోకి వచ్చినందున పండించిన పంటను నాశనం అయిపోయిందని, అధికారుల దృష్టికి తీసుకెళ్లి వెంటనే పరిష్కారం చేస్తానని అన్నారు. ప్రజల సమస్య అడిగి తెలుసుకున్నారు.
దిగువ గూలూరు చెరువు పరిశీలించి అక్కడున్న శివాలయం దర్శనం చేసుకున్నారు,
పుత్తూరు మండలం BJYM అధ్యక్షుడు పురుషోత్తం ఆధ్వర్యంలో ముఖ్య అతిధి గా యం. నిషీధ రాజు పాల్గొని చంద్రపూ నాయుడు కండ్రిగ లో మాట్లాడారు.
ప్రస్తుతం ప్రధానమంత్రి అందిస్తున్న ఉచిత బియ్యం సంబంధించిన బ్యానర్ లు డీలర్ షాపు వద్ద లేకపోవడంతో అక్కడ డీలరుతో మాట్లాడి అతనితో బ్యానరు పెట్టించారు. అనంతరం దేశ ప్రజలకు ప్రధాని మోడీ అందిస్తున్న ప్రజా సంక్షేమ పథకాలను గ్రామంలో లో వివరిస్తూ ప్రజా సంక్షేమ కార్యక్రమాలను గ్రామాల్లో తీసుకుని వెళ్లడం లో భాగంగానే పర్యటిస్తున్నట్లు చెప్పారు. BJYM పురుషోత్తం నివాసంలో ఆమెకు సన్మానం చేశారు . .
ఈ కార్యక్రమానికి పుత్తూరు మండలం అధ్యక్షుడు E శ్రీధర్, BJYM జిల్లా కార్యదర్శి గాలి గాంధీ, వడమాలపేట మండలం అధ్యక్షుడు కొండూరు చాణిక్య వర్మ, పుత్తూరు మండలం ట్రెజరీ శేఖర్, పుత్తూరు మండలం సుబ్రహ్మణ్యం, ఎస్సీ మోర్చా మండల అధ్యక్షుడు బాను చంద్ర, పుత్తూరు మండలం BJYM కార్యదర్శి నీలకంఠ, BJYM యువ నాయకులు చైతన్య, పునీత్, గజేంద్ర, సోమశేఖర్ , నాని మరియు జనసేన నాయకులు గుణశేఖర్, మురుగయ్య, భాస్కర్ , అజిత్ పాల్గొన్నారు
.