శ్రీకాళహస్తి పట్టణంలోని ఆర్ పి బి ఎస్ జడ్పీ బాయ్స్ హై స్కూల్ నందు ఏపీ సీఎం కప్ ఆటలపోటీల కార్యక్రమును ప్రారంభించారు.
ఈ కార్యక్రమమునకు ముఖ్య అతిధులుగా శ్రీకాళహస్తి నియోజకవర్గ శాసనసభ్యులు బియ్యపు మధుసూదన్ రెడ్డి కుమార్తె బియ్యపు పవిత్ర రెడ్డి, బాయ్స్ హై స్కూల్ తల్లి తండ్రుల కమిటీ చైర్మన్ ఆర్కాట్ శంకర్, ఎం పి డి ఓ నరసింహ మూర్తి , ఎం పి పి సంపూర్ణమ్మ, జడ్పీటీసీ వెంకటసుబ్బారెడ్డి, , మార్కెట్ కమిటీ చైర్మన్ వెంకటసుబ్బారెడ్డి , శాప్ డైరెక్టర్ వీర రాఘవ రెడ్డి, ఎం ఈ ఓ భువనేశ్వరి , పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు రాజేశ్వరి, ఎన్ సి సి – సి టి ఓ వెంకటముని మొదలైనవాళ్లు పాల్గొన్నారు.
బియ్యపు పవిత్ర రెడ్డి మాట్లాడుతూ.. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటుచేసిన ఏపీ సీఎం కప్ ఆటలపోటీల కార్యక్రమమును ప్రతి విద్యార్థినీవిదార్థులు ఉపయోగించుకోవాలని కోరారు.
చదువుతో పాటు ఆటలపోటీలలో కూడా పాల్గొనాలని అపుడే విద్యార్థులు శారీరక,మానసిక దృఢత్వముగా ఉంటారని అన్నారు.
ఎం పి డి ఓ నరసింహ మూర్తి మాట్లాడుతూ.. ఈ రోజు నుంచి ప్రారంభమయే ఏపీ సీఎం కప్ ఆటలపోటీల కార్యక్రమములో అథ్లెటిక్, ఖో ఖో , వాలీబాల్, కబాడీ, ఫుట్ బాల్, హ్యాండ్ బాల్, వెయిట్ లిఫ్టింగ్, హాకీ , బాస్కెట్ బాల్ , బాల్ బాడ్మింటన్ , టేబుల్ టెన్నిస్,బాక్సింగ్.. మొదలైన పోటీలు నిర్వహిస్తారు.
ఈ పాటలకు విద్యార్థుల వయపరిమితి 15 సంవత్సరాలు నిండివుండాలి.
ఈ ఆటలపోటీలు పట్టణంలోని ఆర్ పి బి ఎస్ జడ్పీ బాయ్స్ హై స్కూల్, ఎస్ డి కె నగర్ అకాడమీలో క్రికెట్,టెన్నిస్,, డిగ్రీ కాలేజీ ఆవరణలో బ్యాట్మింటన్ పోటీలు జరిగుతాయి అన్నారు.
.