చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లో ఈ రోజు తిరుపతి అర్బన్ జిల్లా ఎస్పీ వెంకటప్ప నాయుడు విలేకర్ల సమావేశం ఏర్పాటు చేసినారు. దీనిలో ఏటీఎం మిషన్లు నగదు అపహరణ నిందితులను అరెస్టు చేసి వారి వివరాలు అందించారు.
ఈ కేసులో ఇప్పటి వరకు సుమారు 15 లక్షల 20 వేల 380 రూపాయలు దొంగతనం చేసినట్టు తెలిసింది. ఈనెల 13వ తేదీ శ్రీకాళహస్తి పట్టణంలోని భారత్ పెట్రోల్ బంక్ ఎదురుగా ఉన్న హౌసింగ్ బోర్డ్ కాలనీ నందు డి సి సి బి బ్యాంక్ ఎటిఎం లో సుమారు 4 లక్షల 95000 అపహరించినట్లు సమాచారం అందుకున్న పోలీసులు దాని ద్వారా పోలీస్ టీం విచారించారు.
తిరుపతి వేదాంతపురం అగ్రహారానికి చెందిన నరేష్, డి సి సి బి బ్యాంక్ అధికారిగా పనిచేస్తున్నారు. అతను మరియు అతని స్నేహితులు విలాసాలకు లోనై అతని స్నేహితులు కలిసి ఏటీఎం మిషన్ దొంగతనానికి పాల్పడ్డారు.
అంతేకాకుండా వీరి స్నేహితులు వినోద్, జయ సూర్య మరియు వంశీ,రమీజ్ మొదలైన వాళ్ళు అనేక ప్రాంతాల్లో ఈ దొంగతనానికి పాల్పడినట్లు విచారణలో తేలింది .
ఇప్పుడు డబ్బులు సుమారు 11 లక్షల 49,900 మరియు నాలుగు సెల్ఫోన్లు, ఒక కారు, బైక్ రికవరీ చేసినట్లు తెలిపారు .
ఈ కేసును విచారించిన సిఐలు ఎస్ఐలు మరి కానిస్టేబుళ్లకు అభినందనలు తెలిపినారు
.