మయూర పరిధిలోని చెరుకు రైతులు బకాయిలు చెల్లించాలని గత5రోజులుగా మయూర షుగర్స్ యజమాని జయరాంచౌదరి ఇంటివద్ద ఆందోళనలు చేస్తుంటే అధికారులు గాని, యాజమాన్యం గాని పట్టించుకోలేదని ఆంధ్రప్రదేశ్ రైతు సంగంజిల్లా ప్రధాన కార్యదర్శి దాసరిజనార్ధన్ విమర్శించారు.
శుక్రవారం నాడు ఆందోళనలు చేస్తున్న రైతు లకు మద్దతు గా జనార్దన్ పాల్గొన్నారు. చెరకురైతుల బకాయిలు కొరకు ఆందోళనకు పోరాటం చేస్తున్న ఏపీ రైతు సంగం జిల్లా అధ్యక్షులు పి హేమలత, కార్యదర్శి జనార్దన్ లు మాట్లాడుతూ గత3సంవత్సరాలుగా రైతు లకు రావాల్సిన 36 కోట్లుబకాయిలు, నరుకుడు కూలీలు బకాయిలు, ట్రాన్స్ పోర్ట్ బకాయిలు కూడా ఇవ్వకుండా బడా పారిశ్రామిక వేత్త అయిన జయరాంచౌదరి కి ప్రభుత్వ యంత్రాంగం మద్దతు పలకడం దారుణ మన్నారు.
రైతు లు అప్పుల ఊబిలో చిక్కుకొని అల్లాడుతుంటే రైతు ప్రభుత్వం అని చేప్పుకొనే ప్రజాప్రతినిధులు పట్టించుకోకుండా రైతు లను గాలికి వదిలేసి నిమ్మకు నీరెత్తినట్లు వున్నారని విమర్శించారు.
అధికారులు చోద్యం చూస్తున్నారు తప్ప ,చట్టాన్ని ఉపయోగించి యజమాని ఆస్తులు వేలం వేసి రైతు ల బకాయిలు చెల్లించాలి అనేఉద్దేశం వారికి లేదని ,పైగా వారికి సహకరిస్తూ (కేన్ విభాగం)ఉన్నారని దుయ్యబట్టారు.
ఇకనైనా అధికారులు స్పందించి సమస్య పరిష్కారం చెయ్యాలని వారు డిమాండ్ చేశారు.లేకపోతే పోరాటాన్ని ఉదృతం చేస్తామని హెచ్చరించారు. ఈకార్యక్రమంలో సి పి ఎం జిల్లా కార్యదర్శి వందవాసి నాగరాజు, డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి జయచంద్ర, ఐద్వా జిల్లా కార్యదర్శి సాయిలక్ష్మి తమ సంపూర్ణ మద్దతు నిచ్చారు.
ఈ కార్యక్రమంలో రైతు నాయకులు కృష్ణమూర్తి, సుబ్బారెడ్డి, ఈశ్వరరెడ్డి,(కడప ), షాన్వాజ్, మహబూబ్ సిరాజ్, బాబునాయుడు, భాస్కర్ రెడ్డి, శంకర్ రెడ్డి, పోలయ్య, గోపీకృష్ణ, విజయ కుమార్, తదితరులు పాల్గొన్నారు.
.