పేదల సేవ తన పరమార్థమని శ్రీకాళహస్తి శాసనసభ్యులు బియ్యపు మధుసూదన రెడ్డి చెప్పారు.
ముఖ్యమంత్రి జగన్ జన్మదినం పురస్కరించుకుని ముందస్తుగా ఆదివారం ఆయన సేవా కార్యక్రమాలు చేపట్టారు.
ఇందులో భాగంగా ప్రత్యేక ప్రతిభావంతులకు ఎలక్ట్రికల్ మూడు చక్రాల బండ్లు, యాచకులకు దుప్పట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా బియ్యపు మధు మాట్లాడుతూ.. పేదల కోసం జగన్ నవరత్నాలు అమలు చేస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారని చెప్పారు.
ఈ పథకాలు పేదల పాలిట వరం అన్నారు. ముఖ్యమంత్రి చేపడుతున్న సంక్షేమ కార్యక్రమాలకు తోడుగా… తాను కూడా ఉడుతా భక్తిగా సేవా కార్యక్రమాలు చేస్తున్నట్లు తెలిపారు.
నిరుపేద యువకులకు ఆటోలు కూడా అందించినట్లు ఆయన చెప్పారు.
ప్రజల ఆశీస్సులతో ఇంకా సేవా కార్యక్రమాలు చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నేతలు పాల్గొన్నారు.
.