శ్రీకాళహస్తి పట్టణంలో దీర్ఘకాలికంగా నెలకొన్న ప్రజా సమస్యలను వెంటనే పరిష్కరించాలని జనసేన నియోజక వర్గం ఇన్ ఛార్జి వినుత కోటా డిమాండు చేశారు.
‘నో మై కాన్ స్టిట్యూషన్’ కార్యక్రమంలో భాగంగా శనివారం ఆమె శ్రీకాళహస్తి పట్టణంలోని ఎన్ టీ ఆర్ నగర్ లో పర్యటించారు. ఆ ప్రాంత ప్రజల సమస్యలను స్వయంగా అడిగి తెలుసుకున్నారు.
తాగునీరు, పారిశుధ్యం, డ్రైనేజీ, ఇళ్లపట్టాలు వంటి సమస్యలను స్థానికులు ఆమె దృష్టికి తీసుకొచ్చారు. తమ సమస్యలపై పలు పర్యాయాలు అధికారులకు తెలియ చేసినా పట్టించు కోలేదని వారు వాపోయారు.
ఈ సందర్భంగా వినుత మాట్లాడుతూ… నేటి పాలకులు ప్రజా సమస్యలు గాలికి వదిలేయడం వలనే ఇలా జరుగుతోందన్నారు. నిత్యావసర సరుకుల ధరలు పెరిగి పోవడంతో పేదల బతుకులు అగమ్య గోచరంగా మారాయని వినుత ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రజల సమస్యలను కలెక్టరుతో పాటు అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి తనవంతు సహకారం అందిస్తానని ఆమె హామీ ఇచ్చారు. తాను అన్ని వేళలా ప్రజలకు అందుబాటులో ఉంటానని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో శ్రీకాళహస్తి పట్టణ అధ్యక్షులు భవానీ శంకర్, శ్రీకాళహస్తి మండల అధ్యక్షులు రాఘవయ్య, ఏర్పేడు మండల అధ్యక్షులు కిరణ్, నాయకులు మణికంఠ, ప్రమోద్, సురేష్, నితీష్, కిషోర్, చందు, గిరీష్, మునిశేఖర్, జనసైనికులు పాల్గొన్నారు.
.