పంజాబ్ ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణికి తగిన గుణపాఠం చెబుతామని బీజేపీ నేతలు కోలా ఆనంద్, చంద్రప్ప అన్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ పంజాబ్ పర్యటనకు భద్రత కల్పించడంలో అక్కడి కాంగ్రెస్ ప్రభుత్వం చూపిన నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ బీజేపీ ఆధ్వర్యంలో శనివారం శ్రీకాళహస్తిలో నిరసన చేశారు.
ఈ సందర్భంగా కోలా ఆనంద్, చంద్రప్ప మాట్లాడుతూ… మాట్లాడుతూ భారతదేశ ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేస్తున్న ప్రధానమంత్రి నరేంద్రమోదీ భద్రత పట్ల పంజాబ్ లోని కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరించిన తీరు దేశం మొత్తాన్ని విస్మయానికి గురి చేసిందన్నారు.
మోదీ సభకు వెళ్ళే మార్గాన్ని ప్రభుత్వమే అక్కడి ఖలిస్తాన్ సానుభూతిపరులకు చేరవేసి వారి మార్గాన్ని అడ్డుకునేలా దగ్గరుండి చేయించారన్న విషయం చాలా స్పష్టంగా కనిపిస్తోందన్నారు.
ఈ విషయం అక్కడ నిరసన చేయడానికి వచ్చిన వారితో స్థానిక పోలీసులు చాయ్ త్రాగుతూ చాలా నిర్లక్ష్యంగా కనిపించిన దృశ్యాలు ఈ సంఘటనకు ప్రత్యక్ష సాక్ష్యమన్నారు.
ఈ సంఘటనపై ఇప్పటికే రాష్ట్రపతి, సుప్రీంకోర్టు మొదలుకొని అందరూ కూడా ప్రత్యేక శ్రద్ధ కనబరచి దర్యాప్తును వేగవంతం చేశారన్నారు. ఇలాంటి చర్యలు పునరావృతం కాకుండా త్వరలోనే కఠినమైన చర్యలు తీసుకోక తప్పదని స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో బీజేపీ పట్టణ అధ్యక్షులు కాసరం రమేష్, నాయకులు చిలకా రంగయ్య, గరికపాటి రమేష్ బాబు, వజ్రం కిషోర్ ,చాగణం శైలజ, పద్మజ, సుకుమార్, బొబ్బిలి రెడ్డి సుబ్రహ్మణ్యం, సుబ్బయ్య తదితరులు పాల్గొన్నారు.
.