చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి పట్టణంలోని శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో వెలసిన జ్ఞానప్రసూనాంబ సమేత శ్రీకాళహస్తీశ్వరుని శనివారం సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్ఠిస్ టీవీ రవికుమార్ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు.
ఆలయ కార్యనిర్వహణాధికారి డి. పెద్దిరాజు వీరికి దక్షిణ గోపురం వద్ద ఆలయ సంప్రదాయాలతో స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు.
దర్శనానంతరం గురుదక్షిణామూర్తి సన్నధిలో ఆలయ పండితులు ఆశీర్వచనం ఇచ్చారు.
స్వామి, అమ్మవార్ల జ్ఞాపిక, తీర్థ ప్రసాదాలు అందజేశారు.
ఈ కార్యక్రమంలో శ్రీకాళహస్తి న్యాయమూర్తి అరుణ, ఆలయ డిప్యూటీ ఈవో కృష్ణారెఢ్డి, డీఎస్పీ విశ్వనాథ్, ఒకటవ పట్టణ ఎస్ఐ సంజీవకుమార్ తదితరులు పాల్గొన్నారు.
.